30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు..
30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు..
నిజాంపేట – ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని శ్రీ రేణుక మాత ఫంక్షన్ హాల్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996-97 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థి దశలో గడిపిన తీపి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకుని నెమరువేసుకున్నారు.
తమతో కలిసి చదువుకున్న ముగ్గురు విద్యార్థులు అకాల మరణం చెందడంతో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, బాలయ్య, జనార్ధన్ రెడ్డి, పూర్వ విద్యార్థులు నసీరుద్దీన్, శివప్రసాద్, దండు ప్రభాకర్, ఎల్లం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, ఆకుల ఎల్లం, మల్లేశం, మోహన్ రెడ్డి, మహేందర్, నర్సింలు, ప్రవీణ్ రెడ్డి, కుమారస్వామి, సహదేవ్, యాదగిరి, ప్రభుదాస్, శ్రీకాంత్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
