చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

కడెం, ఆంధ్రప్రభ : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం కడెం మండలంలోని అంబారిపేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో చిన్నారులకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీవార్మింగ్ మాత్రలు తీసుకోవడం వల్ల పేగు పురుగుల నివారణతో పాటు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి బి. నరేష్ కుమార్, ఎంఎల్‌హెచ్‌పీ రమ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్ యాదవ్, అంగన్‌వాడీ టీచర్ హేమలత, ఆశా కార్యకర్త విజయలక్ష్మి, నాయకులు సత్తన్న, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.