Hidden Treasure | సొంత ఇంటిలో మహిళ అనుమానాస్పద పూజలు
Hidden Treasure | సొంత ఇంటిలో మహిళ అనుమానాస్పద పూజలు
Hidden Treasure | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపాయి. స్థానిక సమాచారం ప్రకారం, ఒక మహిళ తన సొంత స్థలంలో తడకల షెడ్డు వేసి అనుమానాస్పద తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.
స్థానికుల కథనం ప్రకారం, ఆ స్థలంలో నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమతో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి. గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్నారని అనుమానం వ్యక్తమవుతోంది. సంబంధిత మహిళ రోజూ మధ్యాహ్నం సమయంలో పూజలు చేస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. పోలీసులు విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
