5people missing |వృద్ధుడి మృతదేహం లభ్యం

5people missing | వృద్ధుడి మృతదేహం లభ్యం
5people missing |మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతైన ఘటన నేపథ్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ మరో విషాదకర పరిణామం చోటుచేసుకుంది. నదిలో గల్లంతైన వారి కోసం పోలీసులు, మత్స్యకారులు విస్తృతంగా గాలిస్తుండగా గుర్తుతెలియని ఓ వృద్ధుడి మృతదేహం నీటిలో కొట్టుకువచ్చింది.
నదిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి గుర్తింపు, ఆయన ఎక్కడి వ్యక్తి అనే విషయాలపై విచారణ ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, తుంగభద్ర నదిలో గల్లంతైన హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర, సతీశ్, మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను, ఉరవకొండకు చెందిన సంధ్య కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైన ఘటనతో గల్లంతైన వారి కుటుంబాల్లో మరింత ఆందోళన నెలకొంది. లభ్యమైన మృతదేహం గల్లంతైన వారిలో ఎవరికీ చెందిందా లేదా వేరే ఘటనకు సంబంధించిందా అనే విషయంపై పోలీసులు స్పష్టతకు రావాల్సి ఉంది.
