సంప్రదాయ సంబరాలకు సిద్ధమైన గ్రామం..

తిర్యాణి, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని తిర్యాని గ్రామపంచాయతీ పరిధిలో శని, ఆదివారాల్లో ‘ఊరు నేలనప్పుడు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గ్రామంలోని వివిధ కుల సంఘాల పెద్దలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గావుపిల్ల, గట్కోపు గుండా, పోతరాజుల ఆటలు, జాంబవంతుల కోలాహలం వంటి సంప్రదాయ ప్రదర్శనలు కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని పేర్కొన్నారు.
అలాగే కుమ్మరి, కమ్మరి తదితర వర్గాల ప్రజల భాగస్వామ్యంతో గ్రామమంతా కలిసి ఊరు నేలనప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు కోరారు.
