చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేసే కార్యక్రమం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : చిన్నారుల శారీరక మానసిక ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాలు తొలిమెట్లని ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్, మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప, పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్, చిన్న పొర్ల సర్పంచ్ గాండ్ల నికిత ప్రశాంత్, కొత్తపల్లి సర్పంచ్, నర్సిములు, అమీన్ పూర్ సర్పంచ్ టప్పానాగేష్, త్రిప్రాస్ పల్లి సర్పంచ్ విజయలక్ష్మినరసింహ, బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, మొగ్ధంపూర్ సర్పంచ్ తిరుమలేష్, పగిడిమారి సర్పంచ్ జాఫర్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అమ్మ మాట – అంగన్వాడి బాట ర్యాలీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులకు అక్షర జ్ఞానంతో పాటు ఆటపాటలు నేర్పించాలని అన్నారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు గర్భిణీలు బాలింతలు కిషోర బాలికలకు పౌష్టికాహారం అందజేస్తుందని అన్నారు. అంగన్వాడి సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు విద్య ఆరోగ్యంతో పాటు నాణ్యమైన విద్యను అందజేస్తుందన్నారు. అనంతరం చిన్నారులకుదుస్తులుపంపిణీచేశారు. ఆయా కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.