మద్దతు ధరలకు చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్..

మునుగోడు, ఆంధ్రప్రభ : రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ జీవో ప్రతులను దహనం చేశారు.రైతుల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను చట్టబద్ధం చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ ఆందోళన చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురజా రామచంద్రం, నాయకులు బండ శ్రీశైలం,మండల కార్యదర్శి బండమీది యాదయ్య,సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను,సీపీఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేశం,దుబ్బ వెంకన్న,బండారు శంకర్, కురుమూర్తి ముత్తయ్య, యాట యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply