నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్..

జైపూర్, ఆంధ్రప్రభ : భీమారం మండల నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న పలువురుని పోలీసులు పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సీఐ నవిన్ కుమార్ లతో కలిసి వెల్లడించారు. గుంటూరు చెందిన చావలి వెంకటేశ్వర్లు బీమారంలో ఉంటూ వ్యవసాయం చేస్తూ జీవన సాగిస్తున్నాడు.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వెంకటేశ్వర్లు అదే మండలం అరెపల్లికి చెందిన దుర్గం రాములుతో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకోని అరెస్టు చేసినట్లు తెలిపారు.
నిందితులైన వెంకటేశ్వర్లు,రాములు దళారుల వద్ద నకిలీ విత్తనాలను కిలోకు 1600 రూపాయల చొప్పున కొనుగోలు చేసి రైతులకు రూ. 2వేల చొప్పున విక్రయిస్తున్నారు. సమాచారం మేరకు భీమారం ఎస్సై రాజేందర్, వ్యవసాయ అధికారి సుధాకర్ లు కలిసి నిందితుడి ఇంట్లో వెతుకగా సుమారు 102 కిలోల నకిలీ విత్తనాలు లభించడం జరిగిందని అన్నారు. వీటి విలువ రూ. 2లక్షల వరకు ఉంటుందని వివరించారు.
-రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
రైతులు దళారులను నమ్మి నకిలీ విత్తనాల విషయంలో నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు మేలు జరిగుతుందని ఏసీపీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లు పి.మల్లయ్య.ముత్తయ్య కానిస్టేబుల్ లు క్రిష్ణ,నసీర్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
