సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు

మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సైకిలింగ్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జూన్ 3న ప్రపంచ సైక్లింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు జూన్ 3న, బుధవారం ఉదయం 7 గంటలకు మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాన్ సింగ్ రాజ్ పురోహిత్,బి. గోపాలం తెలిపారు. శుక్రవారం మక్తల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు బాల బాలికలకు 5 కి మీ,19 సంవత్సరాలు పైబడిన మహిళలకు పురుషులకు 10 కి.మీ. రోడ్ స్పీడ్ సైక్లింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి మెమొంటోస్, మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేస్తామని తెలిపారు.

అదేవిధంగా రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొన్న బాలబాలికలను ఘనంగా సన్మానిస్తామని అధ్యక్ష కార్యదర్శులు తాన్ సింగ్ రాజ్ పురోహిత్ ,బి. గోపాలం తెలిపారు. క్రీడా నైపుణ్యతను ప్రదర్శించిన వారిని ఎంపిక చేసి, రాష్ట్ర జాతీయస్థాయి సైక్లింగ్ క్రీడలకు పంపుతామని వారు తెలిపారు. పి ఈ టి ,పిడిలు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని వారు కోరారు. ఆసక్తిగల బాలబాలికలు స్వంత సైకిల్ తో, ఆధార్ కార్డు, బోనో ఫైడ్ తో జూన్ 3న ఉదయం ఏడు గంటలకు మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్లో రిపోర్టు చేయాలని వారు తెలిపారు. నిర్వహణ కార్యదర్శులు పి ఈ టి, పి డి లు దామోదర్, విష్ణువర్ధన్, రమేష్, డిఆర్.మీనా కుమారి ,రేణుక, నాగుల అంజి,చంద్రకళ, నిర్వహిస్తారని వారు తెలిపారు.

Leave a Reply