Breaking news | జూ.ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ…
Breaking news | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడం, కార్యక్రమాలు నిర్వహించడంపై ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) సంస్థకు ఎలాంటి అధికారం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ కీలక వివరణ ఇచ్చింది.
ఎన్టీఆర్కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడవుతాయని పేర్కొంది. ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ ఇతర సంస్థలు చేసే ప్రకటనలు, చేపట్టే కార్యక్రమాలను అధికారిక కార్యక్రమాలుగా భావించవద్దని స్పష్టం చేసింది.
ఎన్టీఆర్ పేరుతో ప్రజల్లోకి వెళ్లే సమాచారం విషయంలో అభిమానులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని సూచించింది. ఎన్టీఆర్కు సంబంధించిన అధికారిక ప్రకటనలు, సేవా కార్యక్రమాల సమాచారం ఆయన లేదా అధికారిక బృందం నుంచి వచ్చిన వాటినే విశ్వసించాలని తెలిపింది. ఈ ప్రకటనతో ‘రా ఎన్టీఆర్’ సంస్థకు, నటుడు ఎన్టీఆర్ అధికారిక బృందానికి మధ్య ఎలాంటి అధికారిక అనుబంధం లేదనే విషయంపై స్పష్టత వచ్చినట్లయింది.
