Pawankalyan | కాలుష్యరహిత పుష్కరాలే లక్ష్యం

Pawankalyan | కాలుష్యరహిత పుష్కరాలే లక్ష్యం

Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : గోదావరి పుష్కరాలను పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఆరు జిల్లాల పరిధిలో గుర్తించిన 262 గ్రామ పంచాయతీలను మురుగురహితంగా అభివృద్ధి చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. గోదావరి నదిలోకి మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు చేరకుండా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణతో పాటు పారిశ్రామిక కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు ఆర్టీజీఎస్ తరహాలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. నదుల కాలుష్య నివారణ కోసం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు ఈ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిపారు. అవసరమైతే వీఎస్‌ఆర్‌జీ, స్వచ్ఛాంధ్ర, కాలుష్య నియంత్రణ మండలి నిధులను వినియోగించి గోదావరి పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

Leave a Reply