29mayipl | చండీగఢ్‌లో డూఆర్‌డై
29mayipl | చండీగఢ్‌లో డూఆర్‌డై
29mayipl | నేడు గుజరాత్, రాజస్థాన్ ఢీ
క్లైమాక్స్‌కు ఐపీఎల్ 2026 సీజన్
ఇప్పటికే బెంగళూరు ఫైనల్లోకి..
క్వాలిఫయర్-2లో గుజరాత్, రాజస్థాన్ మధ్య పోరు
మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో మ్యాచ్
రాత్రి 7:30 గంటలకు ప్రారంభం
ఈ మ్యాచ్ విజేత ఫైనల్లో ఆర్సీబీతో ఢీ
29mayipl | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇప్పటికే బెంగళూర్ జట్టు ఘనంగా ఫైనల్లో అడుగుపెట్టగా, ఇప్పుడు రెండో ఫైనలిస్ట్ ఎవరో తేల్చే అత్యంత కీలక పోరు ముందుంది. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్లు తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ మే 29న న్యూ చండీగఢ్‌లోని మహరాజా యాదలబుయదిల సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. విజేత జట్టు ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది. మొత్తంగా చూస్తే ఇది కేవలం ఫైనల్ బెర్త్ కోసం జరిగే మ్యాచ్ మాత్రమే కాదు; అనుభవం వర్సెస్ యువ తుఫాన్ మధ్య జరిగే సమరం. ఒకవైపు గిల్ నాయకత్వంలోని సమతుల్య గుజరాత్ జట్టు, మరోవైపు వైభవ్ సూర్యవంశీ తుఫాన్‌తో ఊపు మీదున్న రాజస్థాన్. ఎవరు ఒత్తిడిని తట్టుకుని నిలబడతారో వారు ఆర్సీబీతో టైటిల్ పోరుకు చేరుకుంటారు.
ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ స్థిరమైన ప్రదర్శనతో లీగ్ దశలో టాప్-2లో నిలిచింది. అయితే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో 92 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి రెండో అవకాశానికి పరిమితమైంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ (Rajat Patidar) ఆడిన దూకుడు ఇన్నింగ్స్ గుజరాత్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని జట్టు తిరిగి నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ మాత్రం అద్భుతమైన మొమెంటమ్‌తో ఈ మ్యాచ్‌కు వస్తోంది. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పై 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టుకు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశి (Vaibhav Sooryavanshi) హీరోగా నిలిచాడు. అతడు కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసక ఇన్నింగ్స్‌లలో ఒకదాన్ని నమోదు చేశాడు. ఈ సీజన్లో అతడు ఇప్పటికే 65 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును అధిగమించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణ కూడా వైభవ్ సూర్యవంశీనే. అతడిని త్వరగా ఔట్ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని గుజరాత్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) స్పష్టం చేశాడు. గత మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బౌలింగ్‌ను వైభవ్ ధాటిగా ఎదుర్కొన్నప్పటికీ, చివరికి అతడి బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఈసారి ఈ ఇద్దరి మధ్య పోరు మ్యాచ్ గమనాన్ని మార్చే అవకాశముంది.
హెడ్-టు-హెడ్ రికార్డుల్లో గుజరాత్ టైటాన్స్‌కే పైచేయి కనిపిస్తోంది. పీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మొత్తం 10 సార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ ఏకంగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, రాజస్థాన్ కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. పిచ్ విషయానికి వస్తే, ముల్లాన్‌పూర్ వేదిక బ్యాటర్లు మరియు బౌలర్లకు సమాన అవకాశాలు ఇచ్చే స్వభావం కలిగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పవర్‌ప్లేలో పరుగులు సాధించిన జట్టుకు ఆధిక్యం లభించే అవకాశం ఉంది. డెత్ ఓవర్లలో బౌలింగ్ కీలకం కానుంది.

గుజరాత్ తరఫున శుభమన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించనుండగా, రాజస్థాన్ ఆశలు వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైశ్వాల్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్లపై నిలిచాయి.
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI:
శుభ్‌మన్ గిల్ (C), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణ.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (C), ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్‌మైర్, సమ్ కరన్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.

CLICK HERE TO READ Qualifier 2 of the IPL| రేపు గుజరాత్, రాజస్థాన్ ఢీ
