నిత్య అన్నదాన పథకానికి లక్ష విరాళం

నిత్య అన్నదాన పథకానికి లక్ష విరాళం
విద్యాధరపురానికి చెందిన జి హరిబాబు కుటుంబం ఉదార సహాయం
ఆలయ అధికారులకు విరాళం చెక్కు అందజేత
ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకిలాద్రి పై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలోని నిత్య అన్నదాన పథకానికి విద్యాధరపురంకు చెందిన జి హరిబాబు వారి కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయగా, వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా, ప్రధాన ఆలయ సూపరెండెంట్ సత్యనారాయణ దాతకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం రసీదులను అందజేశారు.
