మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం
మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం
రేణిగుంట విమానాశ్రయంలో మంత్రులకు ఆత్మీయ ఆహ్వానం
విజయోత్సవ సభలో పాల్గొనేందుకు దామినేడు చేరుకున్న నేతలు
తిరుపతి, జూన్ 12 (ఆంధ్రప్రభ): రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా ఘన స్వాగతం లభించింది.
దామినేడు వద్ద నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులకు జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు స్వాగతం పలికారు.
అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి తదితర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు మంత్రులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి మంత్రులకు ఘన స్వాగతం అందించారు. పూలమాలలు, నినాదాలతో వారిని అభినందించారు. అనంతరం మంత్రులు దామినేడు వద్ద నిర్వహిస్తున్న విజయోత్సవ సభా ప్రాంగణానికి బయలుదేరి వెళ్లారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణం వద్ద ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
