ట్రాపిక్ నివారణకు ప్రత్యేక చర్యలు

ట్రాపిక్ నివారణకు ప్రత్యేక చర్యలు

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ పట్టణ పరిధిలో ట్రాపిక్ కు నివారించి రోడ్ ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం భారీ వాహనాలు వలన వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు గుర్తించి ఇప్పటికే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కోదాడ మిర్యాలగూడెం నుండి వచ్చే భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా బైపాస్ రోడ్ మార్గంలో వెళ్లాలని సూచించారు.

పట్టణంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే స్పాట్ పాయింట్లు గుర్తించి ఆ స్పాట్లో పోలీస్ శాఖ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కోదాడ రోడ్డులో ఎమ్.బీ కెనాల్ వద్ద పట్టణంలోని అడ్డరోడ్డు, మిర్యాలగూడ రోడ్డులో బైపాస్ రోడ్డు వద్ద, లింగగిరి మఠంపల్లి వెళ్ళే బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. వాహన దారులు రోడ్డు భద్రత ట్రాపిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపిన, నిషేధిత సమయంలో పట్టణంలోకి భారీ వాహనాలు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరేష్ హెచ్చరించారు.

Leave a Reply