మహిళా కమిషన్ సభ్యులకు ఆత్మీయ సన్మానం రేపు
మహిళా కమిషన్ సభ్యులకు ఆత్మీయ సన్మానం రేపు
మోత్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా ఇటీవల నియామకమైన శంకరమ్మ, చిట్యాల శ్వేతలకు రేపు మోత్కూర్‌లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండగొని రామచంద్రు, వంగాల సత్యనారాయణ తెలిపారు.
మున్సిపల్ కేంద్రంలోని మధుర మీనాక్షి ఏసీ ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనుమరాలు చిట్యాల శ్వేతలను సన్మానించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.
సన్మాన కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హాజరుకానున్నట్లు వెల్లడించారు.
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి హనుమాండ్ల జాన్సీ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన సభను విజయవంతం చేయాలని కోరారు.
