సూరారంలో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

సూరారంలో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో గురువారం బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు ప్రత్యేక నమాజ్ నిర్వహించారు.గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బచ్చు శ్రీధర్‌రావు, గ్రామశాఖ మహిళా అధ్యక్షురాలు బాషబోయిన రమ, సింగనబోయిన రాములు, సింగనబోయిన కోమల కుమారస్వామి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బచ్చు శ్రీధర్‌రావు మాట్లాడుతూ, బక్రీద్ పండుగ త్యాగం, విశ్వాసం, మానవతా విలువలకు ప్రతీక అని అన్నారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు.సమాజంలో సోదరభావం, ప్రేమ, ఐక్యత పెంపొందించేందుకు ఇటువంటి పండుగలు దోహదపడతాయని పేర్కొన్నారు. మండలంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో నివసించే గ్రామంగా సూరారం ప్రసిద్ధి చెందిందని నాయకులు తెలిపారు.
గ్రామ ప్రజలందరూ పరస్పర సహకారంతో అన్ని పండుగలను ఆనందంగా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బచ్చు బాబురావు, గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు మొలుగూరి భాస్కర్, మాజీ ఉపాధ్యక్షుడు ఇరువాల సాంబయ్య, సీనియర్ నాయకులు బాషబోయిన వీరప్ప, కుర్ర ప్రకాష్ గౌడ్, చల్లూరి వేణు, పొలాటి వేణుగోపాల్ రావు, తిరుమల్ రావు, వేముల రాజు, ఇరువాల ఛత్రపతి, గోసిక రవి, గోసిక తిరుపతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
