Narsimhulapet మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట

Narsimhulapetమహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట

నర్సింహులపేట( Narsimhulapet), ఆంధ్రప్రభ: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని నర్సింహులపేట గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సదస్సు సందర్భంగా నర్సింహులపేట మండల మహిళా సమాఖ్య సంఘానికి మంజూరైన నూతన బస్సును మంగళవారం అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘ సభ్యులు హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పెదమాముల యాకయ్య మాట్లాడుతూ, మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేందుకు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్ బాబు, మండల పంచాయతీ అధికారి కిన్నెర యాకయ్య, ఎస్‌ఐ వెంకన్న, మండల ఏపీఎం రాములు నాయక్, ఎంఎస్‌ఏ మల్సూర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు కడుదుల జ్యోతి, సీసీలు రమణమ్మ, వెంకన్న, సీఏలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply