ప్రతిభ కనబరిచిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు

ప్రతిభ కనబరిచిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు

నిజామాబాద్, ఆంధ్రప్రభ: పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేశారు.

జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ అధ్యక్షతన ఇంటర్మీడియట్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశ్వస్ఫూర్తి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు వంద మంది విశ్వబ్రాహ్మణ విద్యార్థులను సన్మానించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ దుర్శెట్టి రఘుచందర్ హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో మంచి జీవితం పొందడానికి చదువు ఒక్కటే ఉత్తమ మార్గమని అన్నారు. చదువు దేశభక్తి, సంస్కారాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.

విద్యార్థులందరూ శ్రద్ధతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరాలని పిలుపునిచ్చారు. చదువు పరమార్థం సమాజ సేవయేనని అన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవపురం గోపాలకృష్ణను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

రాష్ట్ర స్థాయిలో విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం అత్యుత్తమ స్థాయిలో రాణించేలా తన వంతు సహకారం అందిస్తానని రఘుచందర్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతి సంవత్సరం పురస్కారాలు అందించి ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు అజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ చారి, కోశాధికారి మురళీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ, కోశాధికారి శ్రీధర్, గౌరవాధ్యక్షుడు నూనె రామచందర్, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, పరమేశ్వర్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఇందూరు శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు ప్రకాష్, కోశాధికారి కత్రోజ్ సుమన్, విశ్వబ్రాహ్మణ నాయకులు లక్ష్మణ చారి, సదానంద్, కార్యవర్గ సభ్యులు గంగ ప్రసాద్, సురేష్, ప్రవీణ్, గంగా కిరణ్, నరేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply