పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
కాజిపేట్, ఆంధ్రప్రభ: కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూనిర్వాసితులు, యాక్ట్ అప్రెంటిస్‌లు, స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు కాజిపేట్ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న నిర్వహించనున్న శాంతియుత పాదయాత్ర పోస్టర్‌ను సోమవారం కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆర్‌ఎంయూ ముఖద్వారం వద్ద తెలంగాణ రైల్వే జేఏసీ, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆవిష్కరించారు.
జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు, కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, ప్రజా సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి చుక్కయ్య, సీపీఐ నాయకులు మద్దెల మల్లేష్, నేదునూరి రాజమౌళి, డీవైఎఫ్‌ఐ, ఎమ్మార్పీఎస్, సీఐటీయూ నాయకులు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. 19న మడికొండలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి కాజిపేట్ రైల్వే స్టేషన్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.
