సెంట్రల్‌లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

సెంట్రల్‌లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

పాయకాపురం, ఆంధ్రప్రభ : సెంట్రల్ నియోజకవర్గంలోని పైపులరోడ్డు సెంటర్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేశంలో తొలిసారిగా పింఛన్ పథకం, పక్కా ఇళ్లు, రూ.2 కిలో బియ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి యువతకు అవకాశాలు అందించిన మహానేతగా ఆయన నిలిచారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ అబ్జర్వర్ బచ్చుల బోస్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు ఘంటా కృష్ణమోహన్, నవనీతం సాంబశివరావు, బత్తుల కొండా, వింజమూరి సతీష్, దాసరి కనకారావు, కె. రవికుమార్, తుమ్మలపెంట శ్రీనివాసులు, వల్లభనేని సతీష్, ఎస్‌ఎల్‌వి రాజు, సింగం వెంకన్న, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply