టీఆర్‌ఎస్ జెండా పండుగ సమన్వయకర్తగా మురళీ కృష్ణ నియామకం

టీఆర్‌ఎస్ జెండా పండుగ సమన్వయకర్తగా మురళీ కృష్ణ నియామకం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘జెండా పండుగ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయకర్తలను నియమించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల సమన్వయకర్తగా ఇరిగిజ్జ మురళీ కృష్ణను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి విస్తృతంగా నిర్వహించి, జెండా పండుగను విజయవంతం చేయాలని అధ్యక్షురాలు సూచించినట్లు తెలిపారు.
సమన్వయకర్త మురళీ కృష్ణ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఇరిగిజ్జ మురళీ కృష్ణ ప్రస్తుతం జాగృతి రాష్ట్ర కార్యదర్శి, ఎంబీసీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ‘జనం బాట’ సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జిగా, పార్టీ మేనిఫెస్టో కమిటీలో చైల్డ్ వెల్ఫేర్ అధ్యయన కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
