కండ్రికలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

కండ్రికలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

పాయకాపురం, ఆంధ్రప్రభ: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు సినీ ప్రేక్షకుల ఆరాధ్యుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను స్థానిక 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు.

డివిజన్ అధ్యక్షుడు కే. రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ.. తెలుగు సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా ఎన్టీఆర్ అన్ని పాత్రలను పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారని అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారని కొనియాడారు.

రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదల సంక్షేమ పథకాల అమలులో ఎన్టీఆర్ దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మహానాడు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. బాబు, కోమరి రాజేష్, యువ నాయకుడు హర్షసాయి, కంకణాల బాబు, కొరడ రమణ, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply