20వ వార్డులో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను గురువారం ప్రారంభించారు.

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో, దివిస్ లాబొరేటరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌ను మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, వార్డు కౌన్సిలర్ ఎండి హన్నుతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దివిస్ లాబొరేటరీస్ అధికారులు కిషోర్, గోపి తదితరులు పాల్గొన్నారు. అలాగే వార్డు ప్రజలు, స్థానిక నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో, దివిస్ లాబొరేటరీస్ ముందుకు వచ్చి తమ వార్డులో శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల 20వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై తాగునీటి సమస్యలు తీరతాయని వారు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply