పిల్లలమర్రికి భక్తుల తాకిడి
శివాలయాల్లో ప్రత్యేక పూజలు
సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో కార్తీకమాసం ఆదివారం సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. హైదరాబాద్ విజయవాడ తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలిరావడంతో దేవాలయాల్లో సందడి వాతావరణం నెలకొంది.. సోమవారం (10 వ తేదీ) న 365 కేజీల విభూతి అభిషేకం జరుగుతుందని, ఇంకా భక్తులు తీసుకొచ్చిన విభూతి ని కూడా స్వికరించి అభిషేకం చేస్తామని ఈరోజు రాత్రి 8 లోపుగాని ఉదయం అభిషేకం లోపు దేవాలయాల్లో అందజేయాలని నిర్వాహకులు కోరారు.
