Chityala పిడుగుపాటు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

Chityala పిడుగుపాటు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

  • జడల్‌పేటలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

చిట్యాల( Chityala ), ఆంధ్రప్రభ:

మండలంలోని జడల్‌పేట శివారు గాంధీనగర్‌లో పిడుగుపాటుతో ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హామీ ఇచ్చారు.

సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిన సమయంలో రత్న సారయ్యకు చెందిన పూరిల్లు పిడుగుపాటుకు గురై పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున నగదు, బియ్యం అందజేశారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు అవసరమైన కనీస వసతులు కల్పించి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వసంతరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, కామిడి రత్నాకర్ రెడ్డి, గజ్జి రవి, జడల్‌పేట కాంగ్రెస్ అధ్యక్షుడు గుడి రాజిరెడ్డి, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply