బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధిగా సంతోష్ యాదవ్ నియామకం
బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధిగా సంతోష్ యాదవ్ నియామకం
జనగామ అర్బన్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర అధికార ప్రతినిధిగా జనగామ జిల్లాకు చెందిన చింతకింది సంతోష్ యాదవ్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంతోష్ యాదవ్ క్రమశిక్షణ గల కార్యకర్త అని, గత 13 సంవత్సరాలుగా విద్యార్థి సమస్యల కోసం ఏబీవీపీలో ఉమ్మడి వరంగల్ కేంద్రంగా పనిచేశారని పేర్కొన్నారు.
ఆయన విద్యార్థుల సమస్యలపై పలు ఉద్యమాల్లో పాల్గొని ఎంతోమంది పేద విద్యార్థులకు న్యాయం చేసిన వ్యక్తి అని తెలిపారు. విద్యార్థులను జాతీయవాద భావజాలం వైపు నడిపించడంలో చురుగ్గా పనిచేశారని చెప్పారు. బీజేవైఎంలో చురుకైన పాత్ర పోషించినందున ఆయనను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా చింతకింది సంతోష్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నిర్మాణం కోసం, సిద్ధాంతాల కోసం రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్‌కు, రాష్ట్ర కార్యవర్గానికి, అలాగే జనగామ జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
