ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెంచాలి

ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెంచాలి

  • ప్రైవేట్ విద్యాసంస్థల ప్రచారంపై చర్యలు తీసుకోవాలి
  • ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ డిమాండ్..

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలని జిల్లా కలెక్టర్ చేసిన సూచనలను ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ స్వాగతించింది. అయితే జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఇంటింటికి తిరుగుతూ అడ్మిషన్ ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు విమర్శించారు. శుక్రవారం పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు..ప్రైవేట్ విద్యాసంస్థల విచ్చలవిడి ప్రచారాన్ని నియంత్రించకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెరగడం కష్టమని ఆయన పేర్కొన్నారు.

అలాగే మహాదేవపూర్, కాటారం, చిట్యాల, మల్హర్‌రావు తదితర మండలాల్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు పోస్టుమెట్రిక్ హాస్టళ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు తగ్గడానికి హాస్టల్ సదుపాయాల కొరత కూడా ఒక ప్రధాన కారణమని పేర్కొన్నారు. సంబంధిత మండలాల్లో హాస్టళ్ల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply