ycp | జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లి

ycp | జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లి

ycp | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిసి తమ కుమార్తె కేసులో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తెపై హత్యాచారం జరిగి తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసు విషయంలో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పక్కనపెట్టిందని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమార్తెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జగన్‌ను కోరినట్లు సమాచారం.