AP DeputyCM | పవన్ మాటల వెనుక మర్మం ఏంటి…?

AP DeputyCM | పవన్ మాటల వెనుక మర్మం ఏంటి…?

AP DeputyCM | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తమిళనాడులో ఎన్నికలు ఎంతో సాఫీగా జరిగాయని పేర్కొన్న పవన్ కళ్యాణ్, విజయ్ కటౌట్లు, హోలోగ్రామ్ ప్రచారంతోనే ప్రజల్లో భారీ ఆదరణ సంపాదించుకున్నారని వ్యాఖ్యానించారు. విజయ్ తన మొదటి రాజకీయ పోటీలోనే సీఎం స్థాయికి ఎదిగారని, అయితే తాను మాత్రం రాజకీయాల్లో ఎన్నో అవాంతరాలు, కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని అన్నారు.

AP DeputyCM | ఆత్మపరిశీలనా..? హెచ్చరికా..?

“నాకు కూడా సూపర్ స్టార్ డమ్ ఉంది. కానీ ఈ స్థాయికి రావడానికి 15 ఏళ్ల ప్రయాణం చేయాల్సి వచ్చింది” అంటూ పవన్ వ్యాఖ్యానించారు. విజయ్ అభిమానులు ఆయన కోసం ఒక్కటై పని చేశారని, అదే తమ దగ్గర జరగలేదని పవన్ కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తన అభిమానులే వర్గాలుగా విడిపోయారని, రాజకీయాల్లో ఐక్యత ఎంతో ముఖ్యమని పవన్ చెప్పడం జనసేన శ్రేణుల్లో కూడా చర్చకు కారణమైంది. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు నిజాయితీతో కూడిన ఆత్మపరిశీలనగా అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇది అభిమానులకు సూటిగా ఇచ్చిన హెచ్చరికగా భావిస్తున్నారు.

AP DeputyCM

AP DeputyCM | విమర్శల వలనే..

మరో వైపు తమిళ ప్రేక్షకులు కూడా పవన్ వ్యాఖ్యలను ఆసక్తిగా చర్చిస్తున్నారు. విజయ్ రాజకీయ భవిష్యత్తు పై మరోసారి దృష్టి సారించేలా ఈ వ్యాఖ్యలు మారాయి.
విజయ్ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించి సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పై రకరకాలుగా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇలా స్పందించారని టాక్ వినిపిస్తోంది. పవన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. విజయ్ కటౌట్లు, హోలోగ్రామ్ ప్రచారంతోనే సీఎం అయ్యారనే పవన్ వ్యాఖ్యల పై విజయ్ స్పందిస్తారేమో చూడాలి.

AP DeputyCM

CLICK HERE TO READ KannadaSenioractor | శివరాజ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్‌

CLICK HERE TO READ MORE

Leave a Reply