KannadaSenioractor | శివరాజ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్‌

KannadaSenioractor | శివరాజ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్‌

KannadaSenioractor | పెద్ది ప్రమోషనల్ ఈవెంట్‌లో శివరాజ్ కుమార్ వ్యాఖ్యలు
రామ్ చరణ్ నటనపై ప్రశంసలు
నేషనల్ అవార్డుపై ఆసక్తికర వ్యాఖ్య
చిరంజీవి కుటుంబంపై అభిమానాన్ని వ్యక్తం చేసిన శివరాజ్ కుమార్

KannadaSenioractor | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ : డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఈ చిత్రం గురించి ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు శివరాజ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరులో జరిగిన ‘పెద్ది’ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న శివరాజ్ కుమార్, ఈ సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంటుందని కొనియాడారు. కేవలం నటన మాత్రమే కాకుండా, ఈ చిత్రంతో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు దక్కడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శివరాజ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కర్ణాటక ప్రజలకు చిరంజీవి ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తాను రక్తదానం చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.

CLICK HERE TO READ థియేటర్ల భవిష్యత్తుపై చర్చ..

CLICK HERE TO READ MORE

Leave a Reply