పోలీసులకు యోగా, ధ్యాన శిక్షణ

పోలీసులకు యోగా, ధ్యాన శిక్షణ

హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ కార్యక్రమం రెండో రోజు కొనసాగింపు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పోలీసు సిబ్బందిలో మానసిక ప్రశాంతత పెంపొందించి, విధి నిర్వహణలో సమర్థతను మెరుగుపర్చేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ శిక్షణ కార్యక్రమం రెండో రోజు మంగళవారం కొనసాగింది.

రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది యోగా, ప్రాణాయామం, ధ్యాన సాధనలో పాల్గొన్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ ట్రైనర్లు శ్వాసక్రియ నియంత్రణ, ఏకాగ్రత పెంపొందించే సాధనలు, మానసిక ఒత్తిడి తగ్గించే ధ్యాన పద్ధతులపై శిక్షణ అందించారు.

ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పెరిగి, విధి నిర్వహణలో మరింత చురుకుదనం, సమర్థత సాధించవచ్చని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ట్రైనర్లు పాల్గొన్నారు.

Leave a Reply