యువ క్రికెటర్లపై దృష్టి..

యువ క్రికెటర్లపై దృష్టి..
కృష్ణా జిల్లా అండర్-16 జట్టు ఎంపిక పూర్తి
విజయవాడ, ఆంధ్రప్రభ:
2026–27 సీజన్‌కు సంబంధించి కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ అండర్-16 బాలుర జట్టును ప్రకటించింది. జూన్ 14 నుంచి 24 వరకు మూలపాడులోని రెండు మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు కేడీసీఏ కార్యదర్శి ఎం. రవీంద్ర చౌదరి తెలిపారు.
జట్టుకు ఎస్‌కే యాసిన్ సిద్ధిఖీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జట్టులో కే. థమన్ సాయి, చి. జైవర్ధన్ నాథ్, ఎం. రుత్విక్, పి. ప్రజ్వల్, ఎస్‌కే సమీర్, వి. చంద్రహాస్, డి. రోహన్ శివ్, పీవీ రామ్ కిరణ్, బి. ప్రణీత్, కేహెచ్‌ఎస్ కౌశిక్, పి. చేరన్, టి. చేరన్ తేజా రెడ్డి, ఏ. మైకేల్, పీఎన్‌వీఎస్ మోక్షజ్ఞ, జి. రుషిల్ రామ్, చి. జిష్ణు సాయి ఎంపికయ్యారు.
స్టాండ్‌బై ఆటగాళ్లుగా టి. బాను చైతన్య, బీవీఎంఎస్ సాయిరామ్, ఏఎల్ఎస్‌సీ గణేష్, బి. యాదేశ్, పీఆర్‌వీ కార్తికేయ, జి. సంజిత్‌లను ఎంపిక చేశారు. రాబోయే మ్యాచ్‌ల్లో కృష్ణా జిల్లా జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించాలని కేడీసీఏ ఆశాభావం వ్యక్తం చేసింది.
