కాలినడకన తిరుమల కొండ ఎక్కిన కేంద్ర మంత్రి..

కాలినడకన తిరుమల కొండ ఎక్కిన కేంద్ర మంత్రి..

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం నాడు తిరుమల చేరుకున్నారు. తనయుడు శివాన్ ఎర్రంనాయుడు తొలి తలనీలాలు అర్పించేందుకు తిరుమల చేరుకున్న రామ్మోహన్ నాయుడు కాలినడకన కొండ పైకి వచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటలకు కొండపైకి చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి పై అత్యంత భక్తి విశ్వాసాలు ఉన్న రామ్మోహన్ నాయుడు.. ఆయన సతీమణి శ్రీశ్రావ్య తో కలసి 1000మెట్లకు పైగా బొట్లు పెడుతూ, హారతి ఇస్తూ కొండపైకి వచ్చారు.

అలిపిరి మెట్ల మార్గం గుండా కేంద్ర మంత్రి కొండపైకి చేరగా.. ఆయన సతీమణి శ్రీ శ్రావ్య మాత్రం మొత్తం 3500 మెట్లకు బొట్టు, హారతి పెడుతూ తమలో ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని చాటుకున్నారు. కాగా.. తనయుడు శివాన్ ఎర్రంనాయుడు తొలి తలనీలాలు అర్పించిన అనంతరం సోమవారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.

Leave a Reply