యుపీఎస్ సి ప్రిలిమినరీ పరీక్షలు పర్యవేక్షణ..

యుపీఎస్ సి ప్రిలిమినరీ పరీక్షలు పర్యవేక్షణ..
భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రభుత్వం నిర్వహించిన యు పి ఎస్ సి ప్రిలిమినరీ పరీక్షలను విజయవాడ పశ్చిమ తహశీల్దార్ డి.రిబ్ఖా రాణి పర్యవేక్షించారు. ఆదివారం నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ (2026) పరీక్షలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వివిధ సెంటర్లు నిర్వహణలో భాగంగా భవానీపురంలో శ్రీ చైతన్య కో- ఇడి జూనియర్ కళాశాల సెంటర్ ను పర్యవేక్షించి, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి పరీక్ష కేంద్రానికి ప్రశ్న పత్రాలను ఎస్కార్ట్ తో చేర్చడం జరిగింది. అనంతరం సెంటర్ లో స్టూడెంట్స్ హాల్‌టికెట్లు, ఎగ్జామ్ రూమ్స్ లో జామర్స్ యొక్క పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో 187 మంది విద్యార్థులకు గాను 107 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు, పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.
