ఘనంగా వైసీపీ సీనియర్ నేత జన్మదిన వేడుకలు..

ఘనంగా వైసీపీ సీనియర్ నేత జన్మదిన వేడుకలు..
భారతీనగర్ కార్యాలయంలో సందడి చేసిన పార్టీ శ్రేణులు
దేవినేని అవినాష్ హృదయపూర్వక శుభాకాంక్షలు
మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతల సందడి
ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షలు
పటమట, ఆంధ్రప్రభ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు జన్మదిన వేడుకలు ఆదివారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ లోని భారతీనగర్‌లోని కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి పుష్పగుచ్ఛాలు అందజేస్తూ బుచ్చిబాబు దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే స్వర్గీయ దేవినేని నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని కడియాల బుచ్చిబాబు రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
వ్యక్తిగతంగా, రాజకీయంగా తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ప్రతి సందర్భంలో అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజాసేవ పట్ల బుచ్చిబాబు చూపుతున్న అంకితభావం, పార్టీ పట్ల ఆయన నిబద్ధత అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని అవినాష్ కొనియాడారు. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో చిరకాలం ప్రజల్లో ఉండాలని ఆకాంక్షించారు.
వేడుకల్లో మాజీ మంత్రులు పేర్ని నాని, వేలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్, ఎమ్మెల్సీ రుహుల్లా, జగ్గయ్యపేట ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శైలజాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, దేవినేని కడియాల అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
