Vijayawada అన్నదాన సేవకు భక్తుల ఉదార చేయూత
Vijayawada అన్నదాన సేవకు భక్తుల ఉదార చేయూత
ఆంధ్రప్రభ (Vijayawada), ఇంద్రకీలాద్రి:
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నిత్య అన్నదాన విభాగానికి భక్తులు ఉదారంగా విరాళాలు సమర్పించారు. అమ్మవారిపై భక్తిశ్రద్ధలతో ఇద్దరు దాతలు కలిసి రూ.2,11,111 విరాళాన్ని అందజేశారు.
విజయవాడ బందర్ రోడ్డుకు చెందిన సాదు వెంకట సుబ్బారావు గుప్తా దంపతులు రూ.1,11,111 విరాళం సమర్పించగా, పాయకాపురానికి చెందిన ఎం. శ్రీనివాసరావు రూ.1,00,000 విరాళం అందజేశారు.
దాతలు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారుల సమక్షంలో విరాళాలను భక్తిపూర్వకంగా అందజేశారు.
అమ్మవారి నిత్య అన్నదాన పథకం ద్వారా ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్న నేపథ్యంలో ఈ విరాళాలు సేవా కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడనున్నాయి.
ఈ సందర్భంగా అర్చకులు దాతలకు వేదాశీర్వచనాలు అందజేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.
