100 coconut trees | కొబ్బరి రైతు విలవిల

100 coconut trees | కొబ్బరి రైతు విలవిల

గత ఏడాది రూ.16 పలికితే నేడు రూ.8
సగానికి పైన తగ్గిన దిగుబడులు..
ఎగుమతులకు తప్పని ఆటంకాలు
పేరుకుపోతున్న నిల్వలు..
కలిసిరాని కొబ్బరి సాగు..

100 coconut trees | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: కొబ్బరి పంట పండించే రైతులకు ఈ ఏడాది దిగుబడి దిగాలు పట్టుకుంది. పంట దిగుబడుల్లో సగానికి పైగా తగ్గిపోవడంతో సాగు చేసిన రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. వాతావరణ మార్పులు, తెగుళ్లు వంటి సమస్యలతో దిగుబడులు పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ఎన్నో ఆశలతో సాగుచేసిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. దేశంలో కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనది. ఇక్కడ సుమారు 2.60 లక్షల ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతుంది. కొబ్బరి సాగు విస్తీర్ణంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఆంధ్ర ప్రదేశ్ తరువాత 4వ స్థానంలో ఉంది. ఉత్పత్తులో కూడా ప్రథమ స్థానంలో ఉండే రాష్ట్రం ఐదు నెలలుగా దిగుబడుల్లో తగ్గుతాలతో ఎగుమతులు క్షీణిస్తున్నాయి.

100 coconut trees |
100 coconut trees |

100 coconut trees | గోదావరి జిల్లాల్లో అత్యధిక సాగు..

కొబ్బరి సాగు రాష్ట్రంలో సగానికి పైగా విస్తీర్ణం ఉభయగోదావరి జిల్లాల్లోనే సాగవుతుంది. పశ్చిమగోదావరి, ఏలూరు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలలో కొబ్బరి పంట సుమారు 1.65 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దిగుబడిలో కూడా ఈ జిల్లాలే ప్రథమ స్థానంలో ఉంటాయి. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ సుమారు 90 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి పరిధిలో సుమారు 30వేల ఎకరాల్లో తోటలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 55 వేల ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పాలకొల్లు, యలమంచిలి, నరసాపురం, మొగల్తూరు, ఆచంట మండలాలు కొబ్బరి సాగుకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. గోదావరి డెల్టా ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.

100 coconut trees |

100 coconut trees | తగ్గిన దిగుబడి

రాష్ట్రంలోనే కాక ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరి కాయల దిగుబడి ఈ ఏడాది సగానికి సగం తగ్గింది. ఆక్వా చెరువుల తవ్వకాలు పెరగడంతో ప్రతి ఏడాది కొబ్బరి చెట్ల విస్తీర్ణం తగ్గిపోవడంతో ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆక్వా చెరువుల నుంచి వెలువడే జలాలు పంటబోదుల్లో కలిసి సమీపంలోకి తోటలోకి చేరడంతో చెట్లు ఉన్న దిగుబడి ఉండడం లేదు. కొబ్బరి తోటలు బలహీనమై కాయలు కాయకుండా పోతున్నాయి. మరోవైపు కొబ్బరి తోటలకు తెగుళ్లు కీటకాల సమస్యలతో కాయలు పిందె దశలోనే రాలిపోవడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. నల్లితో కొబ్బరికాయ నాణ్యత తగ్గుతుంది. సాధారణంగా 100 కొబ్బరి చెట్ల నుంచి 4వేల కాయల వరకు దిగుబడి వచ్చే పరిస్థితి నుంచి నేడు 2వేల కాయలు కూడా దిగుబడి రాని పరిస్థితికి కొబ్బరి తోటలు చేరాయి. కొబ్బరి తోటలలో ఎక్కువ వయసున్న చెట్లు ఉండటం వల్ల కూడా దిగుబడి తగ్గుతుంది.

100 coconut trees | నేల చూపులు చూస్తున్న ధరలు…

`గత ఏడాది కాయ రైతు వద్ద 16 రూపాయల పైనే ధర పలకగా నేడు సగం ధర కూడా పలకడం లేదు. రైతుకు ప్రస్తుతం కొబ్బరి కాయకు ఎనిమిది రూపాయలు మించి చెల్లించడం లేదు. ఒకవైపు దిగుబడి తగ్గడంతో పాటు కొబ్బరి కి ధర కూడా లేకపోవడంతో ఈ సాగులో నష్టాలు తప్పడం లేదు. తమిళనాడు నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉండటంతో ఆంధ్ర కొబ్బరి కి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రైతుల వద్ద లక్షల సంఖ్యలో కొబ్బరికాయలు నిల్వలు పేరుకు పోతున్నాయి. ఎగుమతులు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.

రెండు లక్షల కాయ నిల్వ ఉంది

తమిళనాడు నుంచి ఎక్కువగా ఎగుమతులు ఉండటంతో మన రాష్ట్రం నుంచి ఎగుమతులు తగ్గాయి. సాధారణ వ్యాపారస్తుడైన నా వద్ద 2 లక్షల కొబ్బరికాయలు నిలవలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ కాలం కొబ్బరికాయలు నిల్వ ఉంచితే చాలావరకు కాయలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఎగుమతులకు ఆటంకం లేకుండా సాఫీగా ఉంటే రైతులకు, వ్యాపారులకు శ్రేయస్కరం.

  • మాదు రమేష్, కొబ్బరి వ్యాపారి, భీమవరం

CLICK HERE TO READ MORE : PHEIC | ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన డ‌బ్ల్యుహెచ్‌వో

CLICK HERE TO READ MORE

Leave a Reply