సినీ రంగంలో కీలక పదవి… ఎవరికో తెలుసా..?

సినీ రంగంలో కీలక పదవి… ఎవరికో తెలుసా..?

మెహర్ రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన బొండా సిద్ధార్థ

పాయకాపురం, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెహర్ రమేష్ ప్రతిభావంతుడు, అనుభవజ్ఞుడు, దూరదృష్టి కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. సినీ రంగంలోని ప్రతి విభాగంపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు.

కళాకారుల సమస్యలపై మంచి పట్టుతో పాటు పరిశ్రమ అభివృద్ధిపై స్పష్టమైన దృష్టి ఉన్న వ్యక్తికి ఈ కీలక బాధ్యతలు అప్పగించడం రాష్ట్ర ప్రభుత్వ మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ నియామకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

మెహర్ రమేష్ నాయకత్వంలో రాష్ట్రానికి మరిన్ని భారీ చిత్రీకరణలు, సినీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. యువతకు అవకాశాలు కల్పించడం, నాటకరంగ కళాకారుల సంక్షేమం, థియేటర్ల అభివృద్ధి, ఆధునిక ఫిల్మ్ పాలసీ అమలులో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply