రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : వానాకాలం సీజన్‌లో రైతులకు 50 శాతం రాయితీపై పచ్చిరొట్ట (జీలుగ) విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఆదివారం ఆయన మాట్లాడుతూ, చిట్యాల ఆగ్రోస్, గిద్దెముత్తారం ఆగ్రోస్ కేంద్రాల్లో జీలుగ విత్తనాలు రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు.

30 కిలోల జీలుగ విత్తనాల బస్తా ధర రూ.4,905 కాగా, 50 శాతం సబ్సిడీతో రైతులు రూ.2,452.50 మాత్రమే చెల్లించాలని తెలిపారు. ఒక బస్తా విత్తనాలు సుమారు 2.5 ఎకరాలకు సరిపోతాయని పేర్కొన్నారు.

రైతులు వరి పొలాల్లో జీలుగ విత్తనాలు చల్లడం ద్వారా భూమిలో చౌడు తగ్గడంతో పాటు పంట దిగుబడి పెరుగుతుందని సూచించారు.

విత్తనాలు పొందాలనుకునే రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు ప్రతులతో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని ఏవో శ్రీనివాస్ రెడ్డి కోరారు.

Leave a Reply