జాతీయ రహదారిపై బైఠాయింపు..

శాయంపేట, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలో కుక్కల సారయ్య (78) వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన మందారిపేట గ్రామానికి చెందిన పున్నం మల్లారెడ్డి అయిల్ పామ్ తోటలో గత రెండేళ్లుగా కూలీగా పని చేస్తున్నాడు. హఠాత్తుగా శనివారం అయిల్ పామ్ తోటలోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. సారయ్య మృతి విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్ఐ పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని మృత దేహాన్ని పరకాల ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.

అయినప్పటికీ పోలీసులు బలవంతంగా చెత్త తరలించే గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో తరలించడం వివాదానికి దారి తీసింది. దీంతో కుటుంబ సభ్యులు, మద్దతు దారులు తాము మృతదేహాన్ని చూడకుండ, ఫిర్యాదు చేయకుండానే పోలీసులు తరలించడాన్ని పూర్తిగా అనుమానిస్తున్నారు. పామ్ యజమాని కనీస బాధ్యత లేకుండా పరామర్శించలేదని ఆదివారం కొత్తగట్టు సింగారం- మందారిపేట జాతీయ రహదారిపై సుమారు 40 నిమిషాలు ధర్నాకు దిగారు. పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో 2 కిలో మీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వీరికి స్థానిక ఉప సర్పంచ్ కొత్తగట్టు సాయి కృష్ణ మద్దతుగా నిలిచారు. అనంతరం ఎస్ఐ పరమేశ్వర్ న్యాయం చేస్తామని హామీతో విరమించారు.

Leave a Reply