మల్కాపూర్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సు–కారు ఢీ

మల్కాపూర్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సు–కారు ఢీ

తృటిలో తప్పిన భారీ ప్రమాదం

చేవెళ్ల, మే 24 (ఆంధ్రప్రభ): చేవెళ్ల మండల పరిధిలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్ గ్రామ గేట్ సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

అయితే, ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply