తిమ్మాపూర్‌లో అనుమానాస్పద మృతి…

తిమ్మాపూర్‌లో అనుమానాస్పద మృతి…
- చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య…
తిమ్మాపూర్, ఆంధ్రప్రభ ; కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తిరుమల విలాస్ వద్ద, ఆర్టీవో కార్యాలయం వెనుక అనుమానాస్పద మృతి ఘటన చోటుచేసుకుంది. సదాశివపల్లి డివిజన్‌కు చెందిన వ్యక్తి జార్తి శ్రీనిధి చెట్టుకు ఉరేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడి చేతులు కట్టివేసి ఉండటంతో ఇది ఆత్మహత్యా? లేక హత్యా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎల్‌ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
