1996 Siddayya | బీఆర్ఎస్ నేత దారుణ హత్య
1996 Siddayya | బీఆర్ఎస్ నేత దారుణ హత్య
నిన్న ఉదయం మధు కిడ్నాప్
మూడు ముక్కలుగా నరికివేత
గొనెసంచిలో కుక్కి ఎస్పారెస్పీ కెనాల్‌లో పడవేత
సూర్యాపేట జిల్లా యర్కారంలో ఘటన
1996 Siddayya | సూర్యాపేట ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైయ్యారు . మధును మూడు ముక్కలుగా నరికిన దుండులు గోనె సంచుల్లో కట్టి సమీపంలోని ఎస్పారెస్పీ కెనాల్‌లో పడేశారు. నిన్న ఉదయం 10 గంటలకు సూర్యాపేటలో తన నివాసం నుంచి పని నిమిత్తం బయటకు వెళ్లిన మధు సాయంత్రం నుంచి ఫోన్లో సైతం అందుబాటులో లేకుండా పోయారు. రాత్రి 10 గంటలకు మధు హత్యకు గురైయ్యాడని ప్రచారం జరగగా అర్ధరాత్రి 1.30 గంటలకు యర్కారం గ్రామ శివారులోని ఓ పిల్ల కాలువలో హత్య చేసిన మధు మృతదేహన్నీ పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. యర్కారం గ్రామం ఫ్యాక్షన్ పరంగా సున్నితమైన గ్రామం కావడంతో పోలీసులు పికెట్ పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు . హతుడు మధు మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడు కావడంతో రవీందర్ వర్గీయులు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు .

1996 Siddayya | యర్కారంలో హత్యల పరంపర…
యర్కారం గ్రామంలో రాజకీయ హత్యల పరంపర కోనసాగుతోంది. 1985 ప్రాంతంలో గ్రామ టీడీపీ నాయకుడు యలగందుల సిద్దయ్య సూర్యాపేటలో దారుణ హత్యకు గురైయ్యారు. అప్పటి నుంచి తాజా గా జరిగిన మధు హత్య వరకు సుమారుగా ఎనిమిది మంది రాజకీయ కక్షలకు బలైయ్యారు. 1985లో యలగందుల సిద్దయ్య హత్య తరవాత కాంగ్రెస్ నేత పల్లె ఈదయ్య అనంతరం 1996 సిద్దయ్య కుమారుడు అజయ్ హత్యకు గురైయ్యాడు. అప్పటి నుంచి గ్రామం నీవురుగప్పిన నిప్పులా మారింది . అంజయ హత్య జరిగిన కొద్ది రోజులకే అప్పటి గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్ పై హత్యా యత్నం జరిగింది. ఆ ఘటనకు చింతలపాటి చిన్న రమేషే కారణమని భావించి 1999లో అతడిని హత్య చేశారు. రమేష్ హత్య అనంతరం కొంత కాలం ప్రశాంతంగా ఉన్న గ్రామం తిరిగి 2007 లో మిద్దె రవీందర్ హత్యతో భగ్గుమంది . రవీందర్ హత్యతో పోలీసులు గ్రామం పై ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలో మరో ఘటన జరగకుండా అన్ని వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సమన్వయం చేశారు . కొద్దీ రోజులపాటు పోలీసుల చర్యలు ఫలితాల ఇచ్చి గ్రామం ప్రశాంతంగా మారింది .
ఇంతలోనే 2020 లో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నని గ్రామంలో ప్రత్యర్థి వడ్డే ఎల్లయ్య దారుణంగా హత్య చేశాడు. అయితే 2024 ఎల్లయ్యని జగ్గయ్యపేట సమీపంలో అతని ప్రత్యర్థి శ్రీకాంతా చారి హత్య చేశాడు . చింతలపాటి మధు 25 ఏళ్ల క్రితం జరిగిన గ్రామ మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. తాజా ఘటన రవీందర్ వర్గీయులు చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . వరుస హత్య ఘటనలతో గ్రామం మాత్రం అట్టుడికిపోతుంది , గ్రామం పెరు చెబితేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది . కొన్ని కుటుంబాలు రాజకీయ కారణాలతో నలిగిపోయి గ్రామం వదిలి వెళ్తున్నారు.
https://prabhanews.com/august-15/CILCK HERE TO READ MORE : August 15 | ఆరోగ్యవంతమైన ప్రజలే రాష్ట్రానికి సంపద
