జూన్ 10 నాటికి తహసీల్దార్ కార్యాలయం సిద్ధం చేయాలి..

జూన్ 10 నాటికి తహసీల్దార్ కార్యాలయం సిద్ధం చేయాలి..

విద్యుత్, ఇంటర్నెట్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలి..
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, ఆంధ్రప్రభ : పాలకుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి జూన్ 10 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాలకుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ
నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి జూన్ 10 నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయ నిర్వహణకు అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్, తాగునీటి తదితర మౌలిక సదుపాయాలను కూడా అదే గడువులో పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, అధికారులు తరచూ పనులను పర్యవేక్షిస్తూ పనుల పురోగతిని సమీక్షించాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కార్యాలయ భవనం అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉండాలన్నారు. ఈఈ పీఆర్ శంకరయ్య, తహసీల్దార్ సునీత తదితర అధికారులు పాల్గొన్నారు.