యాభైలో పదో తరగతి అనుభూతులు..
యాభైలో పదో తరగతి అనుభూతులు..
ఆర్.ఎమ్.హెచ్. ఎస్.1991సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్దుల సమ్మేళనం..
గోల్డెన్ ఇయర్స్ వైపు 1991బ్యాచ్ పరుగులు…
పాయకాపురం, ఆంధ్రప్రభ : యాభైకి చేరినా కలిసి వికసించే స్నేహానికి ప్రతీకగా నిలిచారు ఆర్. ఎమ్.హెచ్. ఎస్ 1991పదో తరగతి పూర్వ విద్యార్థులు.ఆర్. ఎమ్.హెచ్.ఎస్ 1991పదో తరగతి పూర్వ విద్యార్థులు సమ్మేళనం విజయవాడ పైపులరోడ్డు సెంటర్ ప్రాంతంలోని ఆహ్వాన్ కళ్యాణమండపం ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు.1991పదో తరగతి పూర్వ విద్యార్థుల బ్యాచ్ రీ.యూనియన్ అంటూ గోల్డెన్ జూబ్లీ వైపు పరుగులు తీస్తున్నారు.
అందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.పదిహేను సంవత్సరాల వయస్సులో పదో తరగతి చదువుతూ అప్పటి పాఠశాలలో చదివిన అనుభూతులు, ఉపాధ్యాయులు చెప్పిన బోధనలు పూర్వ విద్యార్థులు నెమరువేసుకొన్నారు.వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ, వ్యాపార రీత్యా స్థిరపడిన విద్యార్థులు ఈ వేదిక ద్వారా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఉత్సాహభరితం 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఆర్. ఎమ్. హెచ్. ఎస్.91 బ్యాచ్ ఘన గోల్డెన్ రీయూనియన్కు సిద్ధం అంటూ శీర్షిక విడుదల చేశారు.
మిస్సవుతున్న స్నేహితుల స్మరణ,సవాళ్ళను అధిగమించిన జీవిత మైలురాళ్లు, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకొన్నారు.35 సంవత్సరాల తరువాత వారంతా మళ్లీ ఒకే వేదికపైకి రావడం పూర్వ స్నేహితులను ఒకరికొకరు చూసుకొంటూ కల్లుచెమ్మగిల్చారు.ఇప్పటికే 20 ఏళ్ల రీయూనియన్, 25 ఏళ్ల సిల్వర్ జూబిలీని విజయవంతంగా జరుపుకున్న ఈ బ్యాచ్, జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టాన్ని కలిసి జరుపుకోవాలనే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని పూర్వ విద్యార్థులు అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ ప్రత్యేక వేడుకను ఎంతో సమగ్రంగా రూపకల్పన చేసి నిర్వహిస్తున్న నిర్వాహక బృందం సుమిత, నలినీకాంత్, అరుణ, సుబ్బు, బాల, సునంద్లను పలువురు ప్రశంశించారు.ఈ రీయూనియన్ కేవలం ఒక సమావేశం మాత్రమే కాదని,ఇది చిన్ననాటి రోజులకు తిరిగి తీసుకెళ్లే ఒక భావోద్వేగ ప్రయాణం, అల్లరి, నవ్వులు, పంచుకున్న అనుభవాలని,అన్ని కలిసి మళ్లీ జీవిస్తాయి.అర్థ శతాబ్దం పూర్తి చేసినా, వారి మనసుల్లోని యవ్వనం అలాగే కొనసాగుతుండటం నిజంగా స్ఫూర్తిదాయకమని పలువురు ప్రశంసించారు.
