శభాష్ కౌన్సిలర్ సాబ్..!
శభాష్ కౌన్సిలర్ సాబ్..!
ఉత్తరాది చెరువు కట్ట కంప చెట్లు తొలగించిన కౌన్సిలర్
రైతులు అడగకున్నా..సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్
మోత్కూర్, ఆంధ్రప్రభ : ఎన్నో సార్లు అడిగితే సైతం…పనులు చేయని ప్రజాప్రతినిధులు ఉండగా…యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో ఓ కౌన్సిలర్ ఎవ్వరూ అడగకుండానే..తానే సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కరించారు.దీంతో రైతులు, ప్రజలు శభాష్ కౌన్సిలర్ సాబ్ అంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 9 వ వార్డ్ జామచెట్ల బావి వద్ద ఉత్తరాది చెరువు కట్ట పై గత 2 ఏళ్లుగా కంపచెట్లు విపరీతంగా పెరగడంతో.. ఈ కట్ట మీదుగా తమ పొలాలకు వెళ్లే రైతులు ,కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల స్థానిక కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ గౌడ్ ఆ కట్ట మీదుగా బైక్ పై వెళ్లగా …నిత్యం రైతులు పడుతున్న ఇబ్బందులు గుర్తించారు.తనను ఎవ్వరూ అడగకున్నా తక్షణమే స్పందించి జేసీబీ సహాయం తో చెరువు కట్ట పై ఇరువైపులా కంపచెట్లను తొలగించడంతో రైతులు శభాష్ కౌన్సిలర్ సాబ్ అని కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే వానాకాలం లో ఈ కట్ట కు ఇరువైపులా ఈత,ఖర్జుర మొక్కలతో పాటు పులా మొక్కలు పెంపకం చేపట్టి,మహిళలు బతుకమ్మ పండుగలకు ఇబ్బందులు పడకుండా త్వరలోనే బతుకమ్మ ఘాట్ నిర్మాణం సైతం చేపట్టి మహిళలకు సౌకర్యం కల్పిస్తామని కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
