media | బీజేపీపై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు
media | బీజేపీపై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు
media | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : భగవంతుడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతూ, మతం పేరుతో సీట్లు గెలిచి అధికారాన్ని కాపాడుకుంటోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి విమర్శించారు. ఈ దేశ ప్రజలకు బీఆర్.అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే రక్షణ కవచమని, ఆ కవచాన్ని తొలగించాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.
ఇవాళ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న కుట్రనే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని రాహుల్ గాంధీ ప్రజలకు వివరిస్తున్నారని పేర్కొన్నారు. ఓటు చోరీ అంశంపై కూడా రాహుల్ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.
ఐటీ సంస్కరణలకు బీజం వేసింది రాజీవ్ గాంధీ అని జగ్గారెడ్డి అన్నారు. పేదల కోసం ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. తెలంగాణను హామీ ఇచ్చినట్లుగానే ఇచ్చిందీ కాంగ్రెస్ పార్టీయేనని, ఏపీకి ప్రత్యేక హోదా కూడా కాంగ్రెస్ ఇస్తుందని చెప్పారు.
విభజన హామీలు నెరవేరాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇండియా కూటమి కాదు.. నేరుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. కాక్రోచ్ పార్టీ ఇప్పుడే మొదలైంది.. వారి అసలు ఉద్దేశాలు ఇంకా బయటపడాల్సి ఉందంటూ వ్యాఖ్యానించారు.
