Donald Trump | ట్రంప్-చైనా చర్చలతో పెరిగిన ఉద్రిక్తత

Donald Trump | ట్రంప్-చైనా చర్చలతో పెరిగిన ఉద్రిక్తత

Donald Trump | తైవాన్ అణు కార్యక్రమం వెనుక చరిత్ర
సెమి కండక్టర్ చిప్‌లపై అమెరికా ఫోకస్
అణ్వస్త్ర పోటీలో తైవాన్, జపాన్, దక్షిణ కొరియా
తూర్పు ఆసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలు

Donald Trump | ఆధునిక చైనా ఎలైట్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మిలటరీ అకాడమీలో కిటికీలు లేని ఒక హాలులో ఒక చిత్రపటం వేలాడుతోంది. అది ఎన్నెస్ట్ డేవిడ్ బెర్మెన్. ఆయన బెర్లిన్ యూనివర్శిటీ ఆర్గానిక్ కెమిస్ట్. ఆయన పేరును నాజీలు ఫౌండేషన్ టెక్స్ట్ బుక్ నుంచి తొలగించారు. ఆయన ఇజ్రాయెల్ మొదటి అణుశక్తి కమిషన్ చైర్మన్. ఆయనను ఆనాటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు షైమన్ పెరెస్ ఇజ్రాయెల్ నిర్మాతల్లో ఒకనిగా పరిగణించారు. ఆయన ఇజ్రాయెల్ అణు కార్యక్రమాన్ని రూపొందించారు.

తొలుత అంటే 1988 ఆరంభంలో రాజకీయ శాస్త్రవేత్త యితిజాక్ స్కిచోర్ తైవాన్‌లోని కావోషింగ్ హాలులో మరో శాస్త్రవేత్త చిత్రపటాన్ని కనుగొన్నారు. అది బెర్మెన్ జ్ఞాపకార్థం పెట్టారని అక్కడ ఎందుకు ఉందో ఎవరూ వివరణ ఇవ్వలేదు. నేను కూడా అడగడానికి ధైర్యం చేయలేదు. ఈ వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన తైవాన్‌కు 14 బిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయాన్ని జాప్యం చేశానని చెప్పారు. సెమి కండక్టర్ చిప్ కోసం ఆయన సంప్రదింపులు జరిపిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. అందుకోసం తాను చేయవచ్చు, లేక చేయకపోవచ్చునని అన్నారు. తమ చిప్ పరిశ్రమను తైవాన్ దొంగిలించిందని అన్నారు.

తైవాన్ నాయకులు దీనిని అనుమానించారు. తైవాన్ సంబంధాల చట్టాన్ని 1979లో అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించింది. అటువంటి రక్షణ పరికరాలు, సేవలు తైవాన్‌కు కూడా చైనాను సంప్రదించకుండా అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చింది. అయితే, తైవాన్ తన మిత్రదేశాన్ని ఎంతవరకు సమర్థిస్తుందోనని కలవరపడింది. తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ మాదిరిగా అణ్వస్త్రాలను సేకరించేందుకు సంసిద్ధమయ్యాయి. ఇప్పుడు ఈ దేశాలను అణ్వస్త్ర దేశాల జాబితాలోకి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చైనాకు దీటుగా తయారు చేయాలని ట్రంప్ చూస్తున్నారు.

తైవాన్‌ను తన చుట్టూ ఉన్న దేశాల పరిస్థితిని బట్టి తన ఆలోచనలను పునఃపరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నారు. తూర్పు ఆసియాలోని దేశాల్లో 85 శాతం హార్మూజ్ జలసంధి ద్వారా చమురు, గ్యాస్ నిక్షేపాలను రవాణా చేస్తున్నాయి. తైవాన్ మాజీ అధ్యక్షుడు ట్సైలింగ్వెన్ అణుశక్తిని దశల వారీగా రద్దు చేసుకోవాలని కోరుతున్నారు. దేశంలో సెమి కండక్టర్ పరిశ్రమ చాలా శక్తిమంతమైనదని, దానినే ప్రోత్సహించాలని చెబుతూ వచ్చారు.

దీనికి తోడు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆధునీకరణ ఈ శతాబ్దం మధ్య నాటికి పూర్తి అవుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ఏం చెబుతున్నదంటే, అగ్రదేశాల జరిపే ఆక్రమణలు నిలవవని. అణ్వస్త్రాలతో ఉత్తర కొరియాలోని ప్రజాబలాన్ని ఎదుర్కోవచ్చని అమెరికా భావించింది. ఉత్తర కొరియాపై 1950లో దాడి చేసింది. చైనాకు చెందిన ద్వీపాలను స్వాధీనం చేసుకోవచ్చని అమెరికా భావించింది. ఆ ద్వీపాలకు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ ద్వారా అణ్వస్త్రాలు పంపవచ్చని భావించింది. చైనా తన అణ్వస్త్ర కార్యక్రమానికి ప్రతిస్పందించింది. చైనా అణు కార్యక్రమంపై సీఐఏ ద్వారా సమాచారాన్ని సేకరించింది. లోప్ నూర్ టెస్ట్‌సైట్ నుంచి సమాచారాన్ని సేకరించింది. అయితే, అవేమీ ఫలించలేదు.

తైవాన్ సైనిక పాలకుడు చి యాంగ్ కైషెక్ బెర్జ్‌మాన్‌ను చేరుకోవాలని తన సేనలను ఆదేశించారు. 1964లో పీఆర్‌సీ మొదటి అణు పరీక్ష జరిపిన తర్వాత బెర్జ్‌మాన్ తైవాన్‌ను చర్చలకు ఆహ్వానించారు. సెంట్రల్ తైవాన్‌లోని సన్ మూన్ లేక్ హోటల్లో వారం రోజుల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చల పర్యవసానంగా ఇజ్రాయెల్ మాదిరి పరిశోధన సంస్థను నెలకొల్పాలని నిర్ణయించారు. అణ్వస్త్రాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్స్ సాధనాలపై పరిశోధనల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇతర అణ్వస్త్ర దేశాల మాదిరిగానే తైవాన్ కూడా శాంతియుత ప్రయోజనాల కోసమే అణ్వస్త్రాలను తయారు చేయదల్చామని ప్రకటించింది. యురేనియాన్ని శుద్ధి చేసుకుంటామని చెప్పింది. అలాగే, ఆయుధాలకు కావాల్సిన ప్లుటోనియంను శుద్ధి చేసుకుంటామని చెప్పింది.

పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌ల నుంచి సాయాన్ని పొందినట్టు సీఐఏ తెలిపింది. 1974-75లోనే తైవాన్ శాస్త్రజ్ఞులు అణుబాంబుకు సంబంధించిన పరికరాలను తయారు చేసే దిశగా ముందడుగు వేసినట్టు సీఐఏ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని విరమించమని అమెరికా నుంచి ఒత్తిడి రావడంతో తైవాన్ లుంగ్ యువాన్ పరిశోధనా పార్క్‌లో ప్లుటోనియాన్ని వేరు చేసే కార్యక్రమాన్ని చేపట్టేందుకు అంగీకరించింది. అణు వార్‌హెడ్స్ తయారీకి అవసరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, అణుశక్తి పరిశోధన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ చాంగ్ హస్సేన్ యీని చేర్చుకుంది. చాంగ్ 1987లో తైవాన్‌కు దొంగతనంగా సమాచారాన్ని అందించారు. అమెరికా ఒత్తిడిపై తైవాన్ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసింది.

ఆ తర్వాత దక్షిణ కొరియా నియంత ఆరేళ్లలో అణ్వస్త్రాలను తయారు చేయాలని తమ దేశంలోని శాస్త్రజ్ఞులను ఆదేశించారు. అయితే, ఈ నిర్ణయం అనేక సందేహాలతో కూడినదని అమెరికా రాయబారి ఫిలిప్ హబీబ్ తెలిపారు. అణ్వస్త్రాలను కలిగి ఉండటం, తయారు చేయడం, తమ భూభాగంలో వాటిని ఉంచడం అనే సూత్రాలకు అనుగుణంగా జపాన్ ఈ కార్యక్రమాన్ని అనుమతించింది. ఆనాటి ప్రధాని ఫోటో ఇసాకో ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత తైవాన్ ప్రపంచంలో 90 శాతం సూపర్ అడ్వాన్స్‌డ్ సెమీ కండక్టర్ చిప్‌లను తయారు చేయడానికి నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమాన్ని అమెరికాకు తీసుకువెళ్లాలని ట్రంప్ యత్నిస్తున్నారు.

ప్రవీణ్ స్వామి@praveenswami
కంట్రిబ్యూటింగ్ ఎడిటర్, ది ప్రింట్

Leave a Reply