22ndMay 2026 | తిరుమల సమాచారం..

22ndMay 2026 | తిరుమల సమాచారం..

22ndMay 2026 | తిరుమల, ఆంధ్రప్రభ :

ఓం నమో వెంకటేశాయ..

“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,

ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”

అర్థం:

కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే

గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మే 21, 2026 నాటికి మొత్తం 79,603 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో 45,125 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.4.35 కోట్ల ఆదాయం లభించింది.

సర్వదర్శనం కోసం ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులు ప్రస్తుతం శ్రీవారి సేవా సదన్ వెలుపల ఉన్న వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం సుమారు 18 నుంచి 24 గంటల వరకు దర్శన సమయం కొనసాగుతోంది.